వైద్య విద్యార్థులకు కీలక అలర్ట్: నీట్ యూజీ ప్రత్యేక రౌండ్ దరఖాస్తుకు గడువు
రిపోర్టర్: అశోక్
స్థలం: మహారాష్ట్ర
మహారాష్ట్రలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే ప్రత్యేక స్ట్రే వేకెన్సీ రౌండ్ రిజిస్ట్రేషన్ గడువును నవంబర్ రెండవ తేదీ వరకు పొడిగించినట్లు రాష్ట్ర సెట్ సెల్ అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నూట ముప్ పై ఎనిమిది ఖాళీ సీట్లను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.