నగరి మున్సిపల్ ఎన్నికల కోసం పటిష్ట బందోబస్తుతో కదనరంగంలోకి పోలీసులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: నగరి
నగరి మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలింగ్ కేంద్రాల్లో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. పోలింగ్ బూత్‌లలో ఏజెంట్ల వివరాలను పరిశీలించి, అర్హులైన వారికి పాసులు జారీ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నగరి మున్సిపల్ పరిధిలో పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలను అమలు చేస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూస్తున్నారు.