సోషల్ మీడియా వీడియో వివాదం: ఐపీఎస్ అధికారి బష్రా బానో బదిలీ

రిపోర్టర్: శివ స్థలం: పశ్చిమ బెంగాల్

యూపీఎస్సీ ఆశావహులను ఉద్దేశించి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన ఖరగ్‌పూర్ అదనపు ఎస్పీ, ఐపీఎస్ అధికారి బష్రా బానోను బెంగాల్ ప్రభుత్వం బదిలీ చేసింది. మతపరమైన పదాలు వాడి, జై హింద్ లేదా వందేమాతరం అనలేదంటూ ఆమెపై వచ్చిన విమర్శలు మరియు ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. ఆమెను రాష్ట్ర సాయుధ పోలీసు డిప్యూటీ కమాండెంట్‌గా నియమించారు.