జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో అర్జీదారుల సమస్యలపై ప్రత్యేక గ్రీవెన్స్ డే
రిపోర్టర్: నరేష్
స్థలం: జగిత్యాల
జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల సౌకర్యార్థం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలను తెలుసుకున్నట్లు ఎస్పీ జగిత్యాల వెల్లడించారు. ఈ సందర్భంగా బాధితుల వినతులను శ్రద్ధగా పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి వారి సమస్యలను చట్టప్రకారం సత్వరమే పరిష్కరించాలని ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.