కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తిశ్రద్ధలతో పులకించిన తొలి శనివారం
రిపోర్టర్: మదన్ రాయల్
స్థలం: తిరుపతి అర్బన్
పురటాసి మొదటి శనివారం సందర్భంగా తిరుపతి కొత్త వీధిలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ పి. వినోద్ రాయల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజలకు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు సాదర స్వాగతం పలికి ప్రత్యేక మర్యాదలు చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని సేవించుకున్నారు.