లండన్ ఈవెంట్లో విజయ్, త్రిష ఎదురుపడటం నెట్టింట వైరల్
రిపోర్టర్: కిరణ్
స్థలం: World
లండన్లో జరిగిన కార్ రేసింగ్ ఈవెంట్లో హీరో విజయ్, నటి త్రిష ఎదురుపడటం తీవ్ర చర్చనీయాంశమైంది. వీఐపీ గ్యాలరీలో విజయ్ మ్యాచ్ చూస్తుండగా త్రిష అక్కడికి రాగానే, ఆయన ఇబ్బందిగా ముఖం పక్కకు తిప్పుకున్నట్లు ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో వీరి బంధంపై వచ్చిన పుకార్ల నేపథ్యంలో ఈ వీడియో నెట్టింట తీవ్ర ఊహాగామాలకు దారితీసింది.