ఐఐటీ విద్యార్థి సాల్ వాకోడే ఆత్మహత్య కేసులో నలుగురు అరెస్ట్
రిపోర్టర్: రాము
స్థలం: Mumbai
ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్య కేసుకు సంబంధించి ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్ చేసినట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై మృతుడి తల్లిదండ్రులు, తోటి విద్యార్థులతో సహా మొత్తం నలుగురి వాంగ్మూలాలను నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. కులవివక్ష వేధింపుల కారణంగానే తన కుమారుడు బలవన్మరణానికి పాల్పడ్డాడని సాహిల్ తండ్రి ఫిర్యాదు చేశారు. నిందితులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆజాద్ మైదాన్ లో కుటుంబ సభ్యులు నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు.