నిరుద్యోగులకు తీపి కబురు ఐబీపీఎస్ పీవో మెయిన్స్ హాల్ టికెట్లు విడుదల
రిపోర్టర్: రమేష్
స్థలం: తెలంగాణ
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ సంస్థ ఐబీపీఎస్ పీవో మెయిన్స్ పరీక్ష 2026కు సంబంధించి హాల్ టికెట్లను విడుదల చేసింది. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ ప్రవేశపత్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 4వ తేదీన మెయిన్స్ పరీక్ష జరగనుండగా, పరీక్ష హాల్లోకి వెళ్లే అభ్యర్థులు విధిగా అడ్మిట్ కార్డుతో పాటు చెల్లుబాటు అయ్యే ఐడీ ప్రూఫ్ తీసుకురావాలని ఐబీపీఎస్ స్పష్టం చేసింది.