డీజే చప్పుళ్లకు అదురుతున్న గుండెలు రెండు రోజుల్లోనే ఐదుగురు మృతి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: తెలంగాణ
తెలుగు రాష్ట్రాల్లో వినాయక నిమజ్జనోత్సవాలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. భారీ డీజే శబ్దాలు, అధిక శారీరక శ్రమ కారణంగా నల్గొండ, పశ్చిమ గోదావరి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో కేవలం రెండు రోజుల్లోనే డ్యాన్స్ చేస్తూ రాము, ఈసు, శివమ్మ, గణేష్ గౌడ్, శ్రీకాంత్, అశోక్ కుమార్ సహా ఐదుగురికి పైగా వ్యక్తులు గుండెపోటుతో మరణించడం కలకలం సృష్టించింది. 100 నుండి 120 డెసిబుల్స్ దాటే భారీ శబ్దాల వల్ల గుండె లయ తప్పుతోందని, వైద్యుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ డీజేల మోతలు ఆపకపోవడం వల్లనే ఈ ప్రాణనష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది.