చిట్టమూరులో అభివృద్ధి పనులు: రూ. కోటి పైచిలుకు నిధులతో శంకుస్థాపన

రిపోర్టర్: Darla Venkateswarlu స్థలం: చిట్టమూరు

చిట్టమూరు మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సోమవారం ఘనంగా శంకుస్థాపనలు చేశారు. మండలంలో రూ.58 లక్షలతో పీహెచ్సీ ల్యాబ్, భవన పునరుద్ధరణ, యల్లసిరిలో అలాగే కొగిలి గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు పార్టీ అధ్యక్షులు గణపర్తి కిషోర్ నాయుడు శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో మౌలిక వసతులు మరియు మెరుగైన వైద్య సేవలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.