గజపతినగరం మండలంలో ఎన్ఎస్ఏపీ పైలట్ ప్రాజెక్టు ప్రారంభం

రిపోర్టర్: విజయ్ స్థలం: విజయనగరం

జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం కింద పింఛను పొందుతున్న ప్రతి లబ్ధిదారుడికి కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష ప్రయోజన బదిలీ విధానంపై పూర్తి అవగాహన కల్పించాలని బొబ్బిలి డివిజినల్ అభివృద్ధి అధికారి కిరణ్కుమార్ కార్యదర్శులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ పింఛనును లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేసే ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోనే తొలి విడత పైలట్ ప్రాజెక్ట్గా గజపతినగరం మండలంలో గురువారం ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఎంపీడీవో కార్యాలయంలో కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు.