ఉప్పల్ స్టేడియం మ్యాచ్ భద్రత: రెండు వేల మంది పోలీసులతో పటిష్ట నిఘా

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా జరగనున్న భారత్, వెస్టిండీస్ టీ20 మ్యాచ్కు భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు సీపీ సుమతి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా సుమారు రెండు వేల రెండు వందల మంది పోలీసులతో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మ్యాచ్కు వచ్చే క్రీడాభిమానుల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను కేటాయించామని, ప్రేక్షకులు రెండు గంటల ముందే స్టేడియానికి చేరుకోవాలని ఆమె స్పష్టం చేశారు.