త్వరలో పెరగనున్న రెపో రేటు: రుణగ్రహీతలపై ఈఎంఐ భారం తప్పదా?

రిపోర్టర్: కృష్ణ స్థలం: India

దేశంలో రెపో రేటును 2027 మార్చి నాటికి 6 శాతానికి పెంచే అవకాశం ఉందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. 2026 డిసెంబర్ నుంచి ఈ పెంపు ప్రక్రియ ప్రారంభం కావచ్చని విశ్లేషించింది. రెపో రేటు పెరిగితే గృహ, వాహన రుణాలపై వడ్డీ భారం పెరిగి, సామాన్యులపై ఈఎంఐల ప్రభావం పడనుంది. ద్రవ్యోల్బణం, ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఆర్‌బీఐ తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది.