ఏపీ స్థానిక ఎన్నికల్లో సంచలనం: అభ్యర్థుల జాబితా ప్రకటనను నిలిపివేసిన ఎస్ఈసీ

రిపోర్టర్: సునీల్ స్థలం: అమరావతి

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ఈ నెల 25వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వంద మున్సిపాలిటీలు మరియు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాలను ప్రకటించవద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నిర్ణయంతో రాజకీయ వర్గాలతో పాటు అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.