ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు అందుతున్న నాసిరకం భోజనంపై అధికారుల నిర్లక్ష్యం

రిపోర్టర్: కిరణ్ స్థలం: నెల్లూరు

రాష్ట్రంలోని వింజమూరు, గూడూరు, కావలి, ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందిస్తున్న భోజనం నాసిరకంగా ఉంటోంది. పప్పులేని సాంబారు, నీళ్ల మజ్జిగతో పాటు పౌష్టికాహారం అందించకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుత్తేదారులు ప్రభుత్వం ఇచ్చే నిధులు సరిపోవట్లేదంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా, అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో రోగులు ఆకలితో అలమటిస్తున్నారు.