హాస్టల్ బాలికలను రిటైర్డ్ ఉద్యోగి వద్దకు పంపిన వంటమనిషి

రిపోర్టర్: సురేష్ స్థలం: ఒంగోలు

ప్రకాశం జిల్లా జరుగుమల్లి బీసీ గర్ల్స్ హాస్టల్కు చెందిన ఇద్దరు విద్యార్థినులను రిటైర్డ్ ఉద్యోగి వెంకటరావు ఇంటికి వంట మనిషి శారద పంపినట్లు అధికారుల విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఒంగోలు గోపాల్నగర్లో నివాసం ఉంటున్న వెంకటరావు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో బాధితులు డయల్ 112కు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారని, వంట మనిషి శారదను విధుల నుంచి తొలగించి వార్డెన్పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.