చిన్నారుల కోసం ప్రత్యేక యూట్యూబ్ ఛానెల్: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రకటన

రిపోర్టర్: సురేష్ స్థలం: ముంబై

చిన్నారుల కోసం ప్రత్యేకంగా బీయింగ్ సల్మాన్ ఖాన్ పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించినట్లు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వెల్లడించారు. ఈ కంటెంట్ పెద్దల కంటే చిన్నపిల్లలను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. పిల్లలకు వినోదంతో పాటు కుటుంబ విలువలు, నటనకు సంబంధించిన మెలకువలు నేర్పించడమే తన ప్రధాన ఉద్దేశమని సల్మాన్ ఖాన్ స్పష్టం చేశారు.