వందేమాతరం ఉత్తర్వులపై కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ తీవ్ర అసంతృప్తి

రిపోర్టర్: కిరణ్ స్థలం: కర్ణాటక

కర్ణాటక ప్రభుత్వ కార్యక్రమాలలో వందేమాతరం గీతాన్ని కేవలం రెండు చరణాలకే పరిమితం చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై ఆ రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం జాతీయ గౌరవ పరిరక్షణ చట్టం మరియు కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధమని సీఎం కార్యాలయానికి రాసిన లేఖలో ఆయన స్పష్టం చేశారు. వివాదాస్పదమైన ఈ ఉత్తర్వులను తక్షణమే పునఃపరిశీలించి మార్పులు చేయాలని గవర్నర్ సూచించారు.