తెల్ల కాగితం మూవీ రివ్యూ: థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హర్ష్ రోషన్ చిత్రం

రిపోర్టర్: అశోక్ స్థలం: హైదరాబాద్

యువ నటుడు హర్ష్ రోషన్ జంటగా నూతన నటి నక్షత్ర నటించిన తెల్ల కాగితం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రమేష్ బ్రాండ్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మొదటి ఆట నుంచే మంచి స్పందన లభిస్తోందని ప్రేక్షకులు తెలిపారు. సినిమాలో కామెడీ ట్రాక్ తో పాటు భావోద్వేగ సన్నివేశాలు అద్భుతంగా పండాయని సోషల్ మీడియా వేదికగా పలువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సినిమా మంచి భావోద్వేగ భరిత చిత్రంగా నిలుస్తుందని సినీ వర్గాలు పేర్కొన్నాయి.