టెలికాం టవర్ల వైర్లను దోచుకుంటున్న దొంగల ముఠా అరెస్ట్
రిపోర్టర్: ramesh chitty
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లి రూరల్ సర్కిల్ పరిధితో పాటు వివిధ ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ టవర్లకు సంబంధించిన కాపర్ వైర్లను చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ కేసుల్లో మొత్తం 8 మంది నిందితులను అదుపులోకి తీసుకుని, న్యాయస్థానం ఎదుట హాజరుపరిచామని సీఐ హనోక్ తెలిపారు. న్యాయస్థానం నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేసినట్లు వెల్లడించారు. ప్రజా ఆస్తుల పరిరక్షణకు పోలీసులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారని, ఇలాంటి అసాఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.