ప్యారడైజ్ సినిమా ప్రశంసలపై భావోద్వేగంగా స్పందించిన ప్రియదర్శి
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
తాజాగా విడుదలైన ప్యారడైజ్ చిత్రంలో నటనను కొనియాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నటుడు ప్రియదర్శి కృతజ్ఞతలు తెలిపారు. పెళ్లిచూపులు చిత్రం నుంచి తన ప్రతి సినిమాను ఆదరిస్తున్నందుకు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానని రామన్నా అంటూ ప్రియదర్శి ఎక్స్ వేదికగా భావోద్వేగ రిప్లై ఇచ్చారు. ఈ చిత్రంలో ప్రియదర్శి పోషించిన ఎమ్మెల్యే శంకరన్న పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.