'ఇదంతా ఉద్యమాన్ని అడ్డంపెట్టుకుని దోచుకున్నది కాదా?': సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
రిపోర్టర్: సునీల్
స్థలం: తెలంగాణ
తెలంగాణ ఉద్యమాన్ని, ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని గత ప్రభుత్వ పెద్దలు విచ్చలవిడిగా భూములు దోచుకున్నారని శాసనసభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో 22ఏ నిషేధిత భూముల అంశంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్ కుటుంబాల ఆధీనంలో వందలాది ఎకరాల భూములు ఉన్నాయని వివరాలతో సహా బయటపెట్టారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ ఆధీనంలో ఉన్న సుమారు 700 ఎకరాల భూమి లెక్కలను 30 రోజుల్లో తేల్చి, ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని పేదలకు, ఎస్సీలకు యజమానులుగా చేస్తామని సీఎం స్పష్టం చేశారు.