గోపాలపురం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు పురందేశ్వరి వెల్లడి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తూర్పు గోదావరి

గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం గౌరీపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వెల్లడించారు. గ్రామాల అభివృద్ధే దేశాభివృద్ధికి అసలైన పునాది అని ఆమె పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఈ సందర్భంగా పురందేశ్వరి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినట్లు ఆమె తెలిపారు.