పాటూరు సమీపంలో వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: ఐరాల
చిత్తూరు జిల్లా ఐరాల మండలం పాటూరు సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఐరాల ఎస్ఐ జయశ్రీ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై వాహనాలను ఆపి తనిఖీ చేశారు. వాహనదారుల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులను క్షుణ్ణంగా పరిశీలించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఈ సందర్భంగా ఎస్ఐ జయశ్రీ సూచించారు.