ఢిల్లీ కోర్టులో లారెన్స్ బిష్ణోయ్ లాయర్కు భారీ షాక్: బెయిల్ పిటిషన్ తిరస్కరణ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: ఢిల్లీ

అంతర్జాతీయ ఆయుధ అక్రమ రవాణా కేసుకు సంబంధించి లారెన్స్ బిష్ణోయ్ లీగల్ టీమ్ సభ్యుడిగా చెప్పుకునే దీపక్ ఖత్రీకి ఊరట లభించలేదని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ను స్పెషల్ జడ్జి కిరణ్ బన్సల్ కొట్టివేశారని అధికారులు తెలిపారు. చట్టపరమైన నిబంధనలు సక్రమంగానే పాటించామని, నిందితుడి వాదనల్లో పటిత లేదని న్యాయస్థానం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.