'తిరుపతిని ఎలక్ట్రానిక్ హబ్‌గా మారుస్తాం': సీఎం చంద్రబాబు

రిపోర్టర్: విజయ్ స్థలం: తిరుపతి

తిరుపతి పట్టణ అభివృద్ధిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటనలు చేశారు. తిరుపతిలో స్కైవాక్ నిర్మాణం, బస్టాండ్ అభివృద్ధి తోపాటు ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నగరాన్ని ఎలక్ట్రానిక్ హబ్‌గా మారుస్తామని, 100 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తితో పాటు టీటీడీ ఆధ్వర్యంలో 5 వేల దేవాలయాల నిర్మాణం, రూ.3165 కోట్ల కార్పస్‌తో అన్నదానం చేపడతామని స్పష్టం చేశారు.