తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ
రిపోర్టర్: రాజేష్
స్థలం: తిరుమల
తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లను నిలిపివేయడంతో భక్తుల రద్దీ భారీగా తగ్గింది. మంగళవారం ఉదయానికి కేవలం 3 కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉండగా, శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, రూ.300 శీఘ్రదర్శనానికి 1 నుంచి 2 గంటల సమయం పడుతోంది. సోమవారం రోజున స్వామివారిని 65,223 మంది భక్తులు దర్శించుకోగా, 27,112 మంది తలనీలాలు సమర్పించారు. అలాగే హుండీ ఆదాయం రూ.3.52 కోట్లు రాగా, 4.29 లక్షల లడ్డూలను టీటీడీ విక్రయించింది.