అమలాపురంలో దారుణం: కంటి ఆపరేషన్ వికటించి చూపు కోల్పోయిన వృద్ధుడు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అమలాపురం

అమలాపురంలోని న్యూ లైఫ్ కంటి ఆసుపత్రిలో క్యాటరాక్ట్ ఆపరేషన్ వికటించి కంటి చూపు కోల్పోయినట్లు రిటైర్డ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గిడుగు సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యంతో నరం తెగిపోయి చూపు పోయిందని, బాధ్యులైన వైద్యులు మరియు ల్యాబ్ నిర్వాహకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్కు ఆయన ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.