స్వాతంత్ర్య సమరంలో బాపూజీ పాత్ర: బొబ్బిలిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
రిపోర్టర్: GANESH BBL
స్థలం: बొబ్బిలి
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారాది గ్రామంలో మహాత్మా గాంధీ 157వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మువ్వల శ్రీనివాసరావు మాట్లాడుతూ అహింసా మార్గంలోనే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని కొనియాడారు. కార్యక్రమంలో మండలాధ్యక్షులు అల్లాడ వెంకటరమణతో పాటు పలువురు స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని బాపూజీ సేవలను స్మరించుకున్నారు.