విజయనగరం అశోక్ గజపతిరాజు బంగ్లాలో ఎన్డీయే సమన్వయ సమావేశం
రిపోర్టర్: GANESH BBL
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా కేంద్రంలో గోవా గవర్నర్ మరియు మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు బంగ్లాలో సోమవారం ఎన్డీయే కూటమి సమన్వయ కమిటీ సమావేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన జరిగిన ఈ కీలక సమావేశంలో బొబ్బిలి శాసనసభ్యులు ఆర్వీఎస్కేకే రంగారావుతో పాటు పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు.