రైతుల పరిహారం కోసం కదంతొక్కిన సీపీఐ దళం

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండలం బేగంపేటలో కాళేశ్వరం ప్యాకేజీ కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసిత రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో రాజాపేట మండల కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. పెండింగ్ బకాయిలు చెల్లించకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి చిగుళ్ల లింగం, నాయకులు మూల పోచయ్య తదితరులు పాల్గొని ప్రభుత్వ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.