షాకింగ్ ఘటన: రెండు వేలకు పైగా పిల్లుల అపహరణ గుట్టురట్టు

రిపోర్టర్: నరేష్ స్థలం: Ho Chi Minh City

వియత్నాంలోని హోచిమిన్ నగరంలో రెండు వేల ఏడు వందలకు పైగా పిల్లులను అపహరించి మాంసం కోసం విక్రయిస్తున్న భారీ ముఠాను పోలీసులు అరెస్టు చేశారని అధికారులు తెలిపారు. రాత్రి సమయాల్లో నివాస ప్రాంతాల నుంచి పిల్లులను దొంగిలించి విక్రయాలు సాగిస్తున్నట్లు విచారణలో తేలింది. లూ థాన్ బిన్ అనే వ్యక్తి నేతృత్వంలో ఈ అక్రమ దందా సాగుతున్నట్లు పోలీసులు గుర్తించి పన్నెండు మందిని అదుపులోకి తీసుకున్నారు. రక్షించిన వాటిలో కొన్నింటిని యజమానులకు అప్పగించారు.