ప్రధాని మోదీ సేవలు ఆదర్శనీయమన్న అదితి గజపతి రాజు

రిపోర్టర్: సతీష్ స్థలం: విజయనగరం

గురజాడ అప్పారావు ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్నారని అదితి గజపతి రాజు పేర్కొన్నారు. విజయనగరంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె దీపాలు వెలిగించి నివాళులర్పించారు. 140 కోట్ల మంది ప్రజలే కుటుంబంగా భావించి మోదీ దేశసేవ చేస్తున్నారని, ఆయన పరిపాలన అందరికీ స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా ఆమె కొనియాడారు.