హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: కారు బోల్తా పడి తండ్రీకొడుకులు మృతి
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Azamgarh
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆజంగఢ్ జిల్లాలో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డివైడర్‌ను ఢీకొట్టి కారు బోల్తా పడిన ఘటనలో తండ్రీకొడుకులు దుర్మరణం చెందారని, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని సాగ్రి సర్కిల్ ఆఫీసర్ దేశ్రాజ్ సింగ్ తెలిపారు. ఢిల్లీ నుండి మౌ జిల్లాకు వెళ్తుండగా డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడమే ఈ ప్రమాదానికి కారణమని సీసీటీవీ టేజ్ ద్వారా పోలీసులు నిర్ధారించారు.