మద్యం టెండర్ల కుంభకోణం: కారుమూరి సునీల్ పాత్రపై ఏసీబీ కోర్టులో సిట్ ఛార్జ్షీట్

రిపోర్టర్: శివ స్థలం: Vijayawada

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం రవాణా టెండర్ల కుంభకోణంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ కీలక పాత్ర పోషించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది. సబ్ కాంట్రాక్టుల కేటాయింపులు, వసూళ్లలో అవినీతికి పాల్పడినట్లు పక్కా ఆధారాలతో విజయవాడలోని ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు అభియోగపత్రం దాఖలు చేసినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి.