'ఎన్నికల అఫిడవిట్‌తో కల్వకుంట్ల ముఠా అడ్డంగా దొరికిపోయింది': మంత్రి పొంగులేటి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తెలంగాణ

సున్నా ఎకరాల నుండి వేల కోట్ల ఆస్తులకు ఎదిగిన భూ బకాసురుడు కేసీఆర్ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. 2004 కరీంనగర్ లోక్ సభ ఎన్నికల అఫిడవిట్‌లో తనకు ఒక్క ఎకరం భూమి లేదని తెలిపిన కేసీఆర్‌కు ఇప్పుడు వేల కోట్ల విలువైన భూములు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ పుట్టుకతోనే వందల ఎకరాలు ఉన్నాయంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తూ, పదేండ్ల అధికారంలో కేవలం తమ కుటుంబ ఆస్తులను మాత్రమే పెంచుకున్నారని మంత్రి పొంగులేటి ఎక్స్ వేదికగా మండిపడ్డారు.