ప్రపంచ ఆరోగ్య రంగంలో తీవ్ర వైద్యుల కొరత తప్పదని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
రిపోర్టర్: రమేష్
స్థలం: World
ప్రపంచ ఆరోగ్య రంగం రానున్న రోజుల్లో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కోనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా జనాభా వృద్ధాప్యంతో పాటు వైద్యుల వయసు కూడా పెరుగుతుండటంతో 2030 నాటికి వైద్యుల కొరత 1.11 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ప్రతి నలుగురు డాక్టర్లలో ఒకరు 55 ఏళ్లకు పైబడినవారే ఉండటంతో రాబోయే దశాబ్ద కాలంలో భారీగా రిటైర్మెంట్ ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది.