భారీ వర్షాలు మరియు వాయుగుండంతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం

రిపోర్టర్: హరి స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వంశధార, నాగావళి, బహుదా నదుల్లో వరద ఉద్ధృతి పెరగడంతో పాటు 12 వేల హెక్టార్లలో వరి పంట నీట మునిగింది. జనజీవనం అస్తవ్యస్తం కావడంతో అధికారులు 115 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా విద్యాసంస్థలకు గురువారం కూడా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సెలవు ప్రకటించారు.