అంతర్జాతీయ టీ20 క్రికెట్లో సరికొత్త చరిత్ర: 200 విజయాలు సాధించిన భారత్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: న్యూఢిల్లీ
అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని అరుదైన మైలురాయిని భారత క్రికెట్ జట్టు అందుకుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు ఆడిన మొత్తం 300 మ్యాచ్లలో ఏకంగా 200 విజయాలు సాధించి ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ధోనీ, రోహిత్ శర్మ సారథ్యంలో ఈ అద్భుత ప్రయాణం సాగిందని, తర్వాతి స్థానంలో ఉన్న పాకిస్థాన్ కంటే మన జట్టు ఎంతో ముందంజలో ఉందని క్రీడా విశ్లేషకులు ప్రశంసించారు.