ఎల్నినో సమస్యలను ఎదుర్కోవడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తెలంగాణ
ఎల్నినో వల్ల ఏర్పడే సమస్యలను ఎదుర్కొనేందుకు, వాటిని సమర్థవంతంగా అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి శ్రీమతి సీతక్క స్పష్టం చేశారు. గతంలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందనపుడు గత ప్రభుత్వంలోని పెద్దలు దానిని తేలిగ్గా కొట్టిపారేశారని, ఆ తర్వాత పరిస్థితులు తలకిందులై వారే స్వయంగా మాస్కులు ధరించి తిరగాల్సి వచ్చిందని ఆమె ఎద్దేవా చేశారు.