'అనుమతి లేనిదే వినాయక మండపాలు వద్దు': పొదలకూరు ఎస్సై శివరాకేష్ వార్నింగ్

రిపోర్టర్: Venkey ...Nlr స్థలం: పొదలకూరు

నెల్లూరు జిల్లా పొదలకూరులో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై ఎస్సై శివరాకేష్ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా సింగిల్ విండో విధానంలో ఆన్లైన్ ద్వారా ముందస్తు పోలీసు అనుమతి పొందాలని ఆయన సూచించారు. రహదారులకు అంతరాయం కలిగించకుండా, విద్యుత్ నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని కోరారు. డీజేలు, రాత్రి వేళల్లో లౌడ్స్పీకర్ల వినియోగానికి అనుమతి లేదని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.