నవంబర్ నాటికి కాళేశ్వరం బరాజ్‌ల పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఉత్తమ్ ఆదేశం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
కాళేశ్వరం బరాజ్లైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పునరుద్ధరణ పనులను నవంబర్ నాటికి చేపట్టాలని, వచ్చే వానకాలానికి ముందే పూర్తిచేయాలని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌లోని కుందన్‌బాగ్ క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ఆయన శనివారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. సాంకేతిక అనుమతులు రాగానే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని, పూర్తి భద్రతా ప్రమాణాలు పాటించాలని మంత్రి స్పష్టం చేశారు.