పంజాబ్ ముఖ్యమంత్రి కాన్వాయ్ అడ్డుకున్న రవ్‌నీత్ సింగ్ బిట్టు అరెస్ట్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: పంజాబ్

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత రవ్‌నీత్ సింగ్ బిట్టును పంజాబ్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. లథియానాలోని పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ గేట్ వద్ద కిసాన్ మేళాకు ముఖ్యమంత్రి వస్తున్న సమయంలో బిట్టు నిరసన చేపట్టారు. తన కాన్వాయ్‌పై జరిగిన దాడికి నిరసనగా సీఎంకు గుడ్లు, టమోటాలు తిరిగిచ్చేందుకు వచ్చానని బిట్టు తెలిపారు. రాజకీయ వ్యతిరేకతను పోలీసు చర్యలతో అణచివేయలేరని ఆయన హెచ్చరించారు.