ఇంద్రకీలాద్రిపై మళ్లీ పచ్చదనం పరిమళించేలా సుందరీకరణ చర్యలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: ఎన్టీఆర్ జిల్లా
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సన్నిధిని హరిత శోభతో తీర్చిదిద్దేందుకు ఏడీసీ ఆధ్వర్యంలో ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అభివృద్ధి పనుల కారణంగా కాంక్రీట్ జంగిల్‌గా మారిన ఆలయ పరిసరాల్లో సుగంధ వృక్షాలు, ఔషధ మొక్కలు పెంచనున్నారు. రాబోయే దసరా ఉత్సవాల నాటికి ఘాట్ రోడ్డు, మెట్ల మార్గాన్ని ఆకర్షణీయమైన పూలమొక్కలతో ముస్తాబు చేయాలని అధికారులు నిర్ణయించారు.