గజపతినగరంలో విషాదం: ప్రేమించి పెళ్లి చేసుకున్న రెండేళ్లకే వివాహిత బలవన్మరణం

రిపోర్టర్: గోపి స్థలం: గజపతినగరం

గజపతినగరం మండలంలోని పాతశ్రీరంగరాజపురం గ్రామానికి చెందిన కొర్నాన ఈశ్వరమ్మ అనే ఇరవై ఒక్క ఏళ్ల వివాహిత మంగళవారం ఉదయం తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఆమె, కొంతకాలంగా భర్తకు దూరంగా తల్లిదండ్రుల వద్దే ఉంటున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదని, ప్రాథమిక సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు.