కాణిపాకంలో ఫ్యాన్ జోరు పెంచుతూ వైఎస్సార్సీపీ నేతల ముమ్మర ప్రచారం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఐరాల

చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకం సెగ్మెంట్లో ఎంపీటీసీ అభ్యర్థి శోభ, జెడ్పీటీసీ అభ్యర్థి దొరబాబు విజయం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించాయి. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని స్థానిక నాయకులు ఓటర్లను హృదయపూర్వకంగా అభ్యర్థించారు.