వైరాలో దివ్యాంగులకు ముగిసిన పది రోజుల వ్యాపార నైపుణ్య శిక్షణ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వైరా
వైరా మండలం గరికపాడులో దివ్యాంగుల కోసం నిర్వహించిన పది రోజుల వ్యాపార నైపుణ్య శిక్షణ ఘనంగా ముగిసింది. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు నిర్వాహకులు అందరికీ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ ఆర్సెటీ డైరెక్టర్ చంద్రశేఖర్, ఎస్ఆర్డీఎస్ డైరెక్టర్ గడ్డం రాంబాబు తదితరులు పాల్గొని స్వయం ఉపాధి ప్రాముఖ్యతను వివరించారు. స్వయం ఉపాధి ఏర్పాటుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.