మంచిర్యాలలో రక్షణ కోసం డీజీపీ ముందుకు బిఆర్ఎస్ నేతలు

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

మంచిర్యాలలో పెరుగుతున్న నేరాలు, గొడవల నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ఒక సమర్థుడైన ఐపీఎస్ అధికారిని నియమించాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ కు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో సోమవారం వారు డీజీపీని కలిసి నియోజకవర్గంలో జరుగుతున్న దాడులపై వివరించి వినతిపత్రం అందజేశారు.