యువతకు మాదకద్రవ్యాలపై అవగాహన: జిల్లాలో ఘనంగా వాలీబాల్ పోటీలు
రిపోర్టర్: గోపి
స్థలం: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన డివిజన్ స్థాయి వాలీబాల్ పోటీలు ముగిశాయని ఎస్పీ కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ (@spasifabad) వెల్లడించారు. ఈ క్రీడా టోర్నీలో మొత్తం అరవై ఐదు జట్లు ఉత్సాహంగా పాల్గొన్నాయని తెలిపారు. యువత గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రీడలు, చదువులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా ఎస్పీ నితికా పంత్ పిలుపునిచ్చారని పేర్కొంటూ ఈ మేరకు ట్వీట్ ద్వారా వివరాలు వెల్లడించారు.