ఢిల్లీలో రాహుల్ గాంధీ అరెస్ట్: కాంగ్రెస్ అగ్రనేత నిర్బంధాన్ని తీవ్రంగా ఖండించిన రేవంత్ రెడ్డి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: వికారాబాద్

ఢిల్లీలోని బారాఖంబా పోలీస్ స్టేషన్ వద్ద ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వెల్లడించారు. వంద సంవత్సరాల క్రితం సైమన్ గో బ్యాక్ నినాదం బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా శక్తివంతమైన నిరోధక రూపంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత తరుణంలో ఎస్ఐఆర్ గో బ్యాక్ నినాదం మన హక్కులను రక్షించుకునేందుకు ఒక ప్రతిఘటనగా మారిందని రేవంత్ రెడ్డి తన సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.